బండి సంజయ్, రేవంత్‌లకు షర్మిల ఫోన్ - కేసీఆర్ బతకనియ్యడు
శనివారం, 1 ఏప్రియల్ 2023 (16:09 IST)
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు కాల్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని షర్మిల కోరారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.
కలిసి పోరాటం చేయకపోతే విపక్షాలను రాష్ట్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బతకనియ్యడని షర్మిల చెప్పారు. ఇక షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని తెలిపారు. అటు రేవంత్ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు.