అత్తారింటికి దారేది ఆడియో... పవన్ కల్యాణ్ ఒక్కడే!

శుక్రవారం, 19 జులై 2013 (12:18 IST)
FILE
మామూలుగా ఆడియో ఫంక్షన్ అనగానే సినీప్రముఖులను ఆహ్వానిస్తారు. అందులోనూ స్టార్ హీరోల ఆడియో వేడుక అయితే పెద్ద పెద్ద గెస్టులే వుంటారు. అయితే, అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా పాటల పండుగ జరుగుతోంది. రేపు సాయంకాలం హైదరాబాదు, మాదాపూర్లోని శిల్ప కళా వేదికలో జరిగే ఈ వేడుకకు గెస్టులు ఎవరూ వుండరని సీనీవర్గాల సమాచారం!

కేవలం సినిమాలో నటించిన నటీనటులు, చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు మాత్రమే హాజరవుతారు. వీరే వేదిక మీద ఉంటారు. వీరే ఆడియోను విడుదల చేస్తారు. వేలాదిమంది అభిమానులు తరలి వస్తున్నా ఈ వేడుకకు పవన్ కల్యాణ్ ఒక్కడే ప్రత్యేక ఆకర్షణ. మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ హాజరు కావడం లేదని అంటున్నారు!

వెబ్దునియా పై చదవండి