పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా "ఖుషి" ఫేం ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఎస్.సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్, నిర్మాత రమేష్ బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం "కొమరం పులి" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.జె సూర్య మాట్లాడుతూ... ఖుషిలాంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న కొమరం పులి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కొమరం పులిగా పవన్ కల్యాణ్ నిజంగా పులిలాగా ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో ఇంత గొప్ప కమర్షియల్ హిట్ ఫిల్మ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్‌గా కొమరం పులిగా పవన్ కల్యాణ్ హిస్టరీ క్రియేట్ చేస్తారు అన్నారు.
నిర్మాత రమేష్ మాట్లాడుతూ... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం బ్యాలెన్స్ సాంగ్స్ చిత్రీకరణ ఏప్రిల్ 25 నుంచి నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. ఖుషి దర్శకుడు సూర్య కొమరం పులిగా పవన్ కల్యాణ్‌ను అద్భుతంగా చూపించబోతున్నారు. ఈ సబ్జెక్ట్ విని ఎంతో ఇన్‌స్పైర్ అయి ఎ.ఆర్.రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఈ చిత్రం రీ-రికార్డింగ్‌ని రెహమాన్ లండన్‌లో చేస్తున్నారు.
హిందీ దేవదాస్, రంగ్ దే బసంతి వంటి చిత్రాల ఛాయాగ్రహకుడు బినోద్ ప్రదాన్ ఈ చిత్రానికి అద్భుతమైన ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. యాక్షన్ పరంగా ఈ చిత్రానికి థ్రిల్స్‌ని విజయన్, టినువర్మ హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా తీశారు. పవర్‌ఫుల్ స్టోరీతో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా కొమరం పులి చిత్రం రూపొందుతోందనీ, అతి త్వరలోనే ఆడియోను సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల చేసి మే మూడోవారంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, నికిషా పటేల్, మనోజ్ బాజ్‌పాయ్, నాజర్, చరణ్ రాజ్, అలీ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు.