"దరవు" దర్శకుని డైరెక్షన్లో అజిత్‌ హీరోగా 100వ చిత్రం!

గురువారం, 7 జూన్ 2012 (18:52 IST)
తమిళ కెమెరామెన్‌ శివ తెలుగువారి పుణ్యమా అని కెమెరామెన్‌గా అసిస్టెంట్‌గా చివరికి దర్శకుడిగా మారాడు. శౌర్యం, శంఖం వంటి చిత్రాలను తీసిన ఆయన తాజాగా రవితేజతో 'దరువు' అనే సినిమా చేశాడు. ఆ చిత్రం ఏవరేజ్‌గా పోతోంది. దరువు సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని శివ చెప్పాడు.

తాజాగా తన కమిట్‌మెంట్స్‌ గురించి చెబుతూ- విజయవారి సంస్థను నెలకొల్పిన చక్రపాణి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి బేనర్‌లో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. అజిత్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తానన్నారు.

యముడు కాన్సెప్ట్‌తో వచ్చిన దరువు చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసే ఆలోచన ఉందా? అని అడిగితే.... ఒకరిద్దరు వస్తున్నారు. వీలుంటే చేస్తానంటూనే... తమిళంలో యముని కాన్సెప్ట్‌ అంతగా వర్కవుట్‌ కావని చెబుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి