నా పెళ్లి మా నాన్న ఇష్టం... అప్పటి దాకా ఉంటారా..? "చిరు" ప్రశ్న

బుధవారం, 9 మార్చి 2011 (14:01 IST)
WD
బన్నీ మ్యారేజ్ రిసెప్షన్ పార్టీలో ఓ ఆసక్తికరమైన అంశం ఒకటి జరిగింది. రిసెప్షన్‌లో బన్ని అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ... నా పెళ్లయిపోయింది. ఇక మగధీర పెళ్లెప్పుడనేగా మీ సందేహం అని అంటూ పెళ్లెప్పుడన్న విషయం రాంచరణ్ మీకు చెబుతాడని మైకు ఆయనకిచ్చాడు.

మైకు అందుకున్న రాంచరణ్, నా పెళ్లి మా నాన్న ఇష్టం అని చిరునవ్వు నవ్వుతూ మైకును చిరంజీవికి ఇచ్చాడు. మైకు అందుకున్న చిరంజీవి మాట్లాడుతూ... మేం పెళ్లి చేసేవరకూ వీళ్లు ఆగుతారా...? అని అంటూ చమక్కు విసిరారు. దీంతో సభలో చప్పట్లు మారుమోగాయి.

చిరంజీవి ఇలా వ్యాఖ్యానించడంతో రాంచరణ్ కూడా ప్రేమలోకంలో కూరుకుపోయాడా...? ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నాడా..? అనే చర్చ మొదలైంది. పైగా రాంచరణ్ సోదరి శ్రీజది ప్రేమ వివాహమే. అదేవిధంగా ఇప్పుడు బన్నీ కూడా స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిరంజీవి వ్యాఖ్యలను బట్టి రాంచరణ్ కూడా వీరి దారిలోనే పయనిస్తున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. లెట్ అజ్ వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి