గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

సెల్వి

సోమవారం, 28 జులై 2025 (15:37 IST)
Chilli Chicken
గబ్బిలాలను వేటాడి వాటి మాంసాన్ని చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్న ఘటన తమిళనాడులోనే సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అడవుల్లో గబ్బిలాలను వేటాడే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద జరిపిన విచారణలో వారు గబ్బిలాలను వేటాడి.. హోటళ్లకు సప్లై చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ సమాచారంతో సేలం పోలీసులు, ఆహార భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై తనిఖీలకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై ప్రజలు షాక్ అయ్యారు. ఇలాంటి మోసగాళ్లను అదుపులోకి తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 
 
అలాగే ఆహార భద్రతపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుండటంతో  పోలీసులు ఈ గబ్బిలాల మాంసం కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రజలు కూడా బయటి ఆహారాన్ని తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు