సెంటిమెంట్ లేని సుమంత్!

ప్రతిమనిషిలో ఏదో ఒక చోట సెంటిమెంట్ ఉంటుంది. అవసరాన్ని ఒట్టి అది బయటపడుతుంది. కరడుగట్టిన తీవ్రవాదినైనా సినిమాల్లో హీరో తను చెప్పే సెంటిమెంట్‌ డైలాగ్‌తో హృదయాన్ని కదిలించి వేస్తాడు. బాగా బతికిన వాడు అప్పుల పాలైతే తనే చేయిచ్చి ఆదుకుంటాడు. అది హీరోయిజం. కానీ నిజజీవితంలో ఆ హీరోలకు మచ్చుకైనా కానరావు.

రంగుల లోకంలో ఇలాంటి కథలో చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. తాజాగా నటుడు సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.. "సత్యం" మినహా కెరీర్‌కు సరైన హిట్‌లేక, చిత్రాలు రాక సతమతమవుతున్నా తన పంతాలు, పట్టింపులు ఏమాత్రం వీడలేదు.

ఎప్పుడో నాలుగేళ్లక్రితం "విజయ్ ఐపీఎస్" అనే చిత్రాన్ని జయకృష్ణ అనే నిర్మాత నిర్మించి ఆ తర్వాత ఫైనాన్స్ ప్రాబ్లమ్‌వల్ల రిలీజ్ చేయలేకపోయాడు. ఆయన దుస్థితి గ్రహించిన నట్టికుమార్ అనే నిర్మాత ఓ ప్రముఖ ఫైనాన్షియర్‌తో కలిసి ఆ సినిమాను ముందుకు తేవడానికి ప్రయత్నించి సినిమా తీసినంత కష్టాలు అనుభవించారు.

ఆ సినిమాను తీసుకునే నిర్మాతకు చేదోడుగా ఉంటుందని, తనకు ఏదైనా సుడి బాగుంటే నాలుగు డబ్బులు వస్తాయని నట్టికుమార్ అభిప్రాయపడ్డారు. మరి ఆ సినిమా ల్యాబ్‌లో నుంచి బయటకు రావాలి. అక్కడ 7,8 లక్షలు కడితే సరిపోతుంది.

కానీ... ఈ విషయం తెలిసిన హీరో సుమంత్ దాన్ని అడ్డుకున్నారు. తనకు జయకృష్ణ అనే నిర్మాత 15లక్షలు ఇవ్వాలని, అది ఇచ్చాకే విడుదలచేయమని పట్టుపట్టారు. ఆఖరికి నట్టికుమార్‌తో పాటు మరో ఫైనాన్షియర్ కాళ్ళావేళ్ళాపడి 13 లక్షలకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు.

మరి పబ్లిసిటీ విషయంలో ఏ మాత్రం సహకరించనని చెప్పేశాడు. ఏదేమైనా తలపెట్టిన కార్యం పూర్తిగా ముగించాలంటూ.. మిగతా అప్పులు కూడా తీర్చే 60లక్షల రూపాయల డెఫిషిట్‌తో సినిమాను రిలీజ్ చేశారు. 35 ప్రింట్లతో శుక్రవారం నాడు విడుదలైన ఆ సినిమాను బి.సి. సెంటర్లలో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దీంతో ప్రస్తుత నిర్మాత నట్టి కుమార్ ఆ చిత్రం లాగానే రెండు వారాలు ఆడితే చాలని దేవుడికి మొక్కుకున్నాడు.

ఇంకో విచిత్రమేమిటంటే, శుక్రవారం సాయంత్రమే సుమంత్ తండ్రి శివప్రతాప్ రెడ్డి, నిర్మాత నట్టికుమార్‌కు ఫోన్ చేసి... జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకోకండి... అంటూ... చెప్పి... మావాడి సినిమా బాగుందని, టాక్ వచ్చింది. విడుదల చేసినందుకు కృతజ్ఞతలంటూ మాట్లాడాడట. అవసరమైతే సుమంత్ కూడా ప్రమోషన్‌కు సహకరిస్తాడంటూ.. అన్యాపదేశంగా చెప్పాడట.

మరి నిర్మాత కూడా అలాగే... అంటూ... ప్రమోషన్‌కు అవసరమైతే నేను పిలుస్తానంటూ చెప్పాడట. ఇవన్నీ ఇండస్ట్రీలోని హీరోల సెంటిమెంట్లు.

వెబ్దునియా పై చదవండి