హాట్ పోలీసుగా అలరించనున్న సెక్సీ ఆంటీ!

శనివారం, 9 నవంబరు 2013 (11:29 IST)
FILE
అప్పట్లో గొప్ప సెక్సీయస్ట్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న నటి రమ్యకృష్ణ ఈ మధ్య వెండితెరపై కనిపించడం మానేసింది. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్న రమ్యకృష్ణ ఇప్పుడు మళయాళంలో ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ చాలా హాట్ అనగా మొండి పోలీసు ఆఫీసరుగా నటిస్తోందట. హీరోయిన్‌గా కెరీర్ చివరి దశలోకి వచ్చిన తర్వాత అత్త పాత్రలతో, ఐటెం సాంగులతో కొన్నాళ్లపాటు అలరించిన రమ్యకృష్ణ ఆ తర్వాత బుల్లితెరకు పరిమితమయ్యింది.

తాజాగా మళయాళంలో మనోజ్ పాలోడెన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డ్రైవర్ ఆన్ డ్యూటీ'లో రమ్యకృష్ణ నటిస్తోంది. ఓ మహిళా పోలీసు స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని మళయాళ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అయితే రమ్యకృష్ణకు తెలుగు, తమిళంలో కూడా ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా.. రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం డబ్బింగు రూపంలో తెలుగులో కూడా వస్తుందని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి