తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శక్తీశ్వరన్ అనే యువకుడు అధిక బరువుతో బాధపడుతూ వచ్చాడు. ఈ బరువు తగ్గేందుకు ఆయన పలు రకాలైన ఆహార నియమాలను పాటిస్తూ వచ్చాడు. ఇందులో ఒకటి... ఫ్రూట్ జ్యూస్ డైట్ ఒకటి. అలాగే, బరువుతగ్గేందుకు యూట్యూబ్ వీడియోల్లో చెప్పిన సలహాలు మాత్రమే పాటిస్తూ వచ్చాడు. అదేసమయంలో త్వరితగతిన బరువు తగ్గేందుకు వ్యాయామాలు కూడా చేసేవాడు.
ఈ క్రమంలో గురువారం ఊపిరి ఆడకపోవడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.