హైదరాబాద్ రోడ్లు ఎంత ట్రాఫిక్‌గా ఉంటాయో తెలిసిందే. ఈ రోడ్స్ మీద బైక్ రైడ్ చేయాలనే కోరిక సమంతకు పుట్టింది. అంతే ఆర్య దగ్గర ఆ కోరిక వెలిబులిచ్చింది. అందాల భామ అడిగితే ఆర్య ఊరుకుంటాడా. ఎంచక్కా తన బైక్ మీద ఎక్కించుకుని సమంత కోరికను తీర్చేశాడు.
ఇంతకీ ఈ ఆర్య వరుడులో విలన్‌గా నటించిన ఆర్య కాదు. సమంతకు అసిస్టెంట్‌గా చేస్తున్న ఆర్య. ఈ విషయాన్ని సమంతే చెప్పింది. అసిస్టెంట్ బైక్ ఎక్కి తిరిగిందంటే తన అసిస్టెంట్లతో సమంత ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.