రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం 'బాహుబలి'. భారత సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. 'బాహుబలి' జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ వేగంగా జరుగుతున్నాయి.