టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ భార్య, నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌కి రూ. 22 లక్షల చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ళ జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు విధించిన నేపధ్యంలో ఆమె ఆ డబ్బు చెల్లించడంతో బెయిల్ మంజూరయింది. కోర్టు తీర్పు వెలువరించగానే మధ్యాహ్నం జీవిత వెనువెంటనే 25 లక్షల రూపాయల జరిమానాను చెల్లించేసింది. దీంతో ఎర్రమంజిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.