దీంతో ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా బండ్ల గణేష్ వైపు నుంచి స్పందన లేక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బండ్ల గణేష్ మీద ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి, పరారీలో ఉన్న బండ్ల గణేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.