ఒక నటిగా అందాలను ఆరబోసేందుకు (ఎక్స్పోజింగ్) తనకు ఎలాంటి హద్దులు లేవని బాలీవుడ్ సెక్స్ బాండ్ రాఖీ సావంత్ చెపుతోంది. ఒక దశాబ్దం క్రితం రాఖీ సావంత్ 'మొహబ్బత్ హై మిర్చి' అనే చిత్రంలో ఐటం సాంగ్లో తన అందాలను ఆరబోసింది. తాజాగా ఈమె నటించిన 'ముంబై కాన్ డ్యాన్సా సాలా' అనే చిత్రంలో మరింతగా రెచ్చిపోయినట్టు సమాచారం.
ఈ చిత్రం గురించి రాఖీ సావంత్ స్పందిస్తూ.. చిత్రపరిశ్రమలో కొనసాగాలన్నా.. రాణించాలన్నా నా శరీర అందాలను చూపించక తప్పదు. గత రెండేళ్ళుగా తనకు ఎలాంటి ఆఫర్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కొనసాగడం చాలా కష్టం. పైగా నేను సినీ ఇండస్ట్రీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచిరాలేదు. అందువల్ల నాకెలాంటి సపోర్టు, గాడ్ ఫాదర్లు లేరన్నారు.