నూతన కథానాయిక తేజస్వినితో న్యూడ్‌గా నటింపజేసి సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇపుడు టాలీవుడ్‌లో పెద్ద సంచలనానికి తెరలేపాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'ఐస్‌క్రీమ్' చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం తేజస్వి పూర్తి నగ్నంగా నటించింది. ఈ విషయాన్ని ఆ చిత్ర యూనిట్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
అయితే, 'ఆ సన్నివేశాన్ని' చిత్రీకరించేటప్పుడు డైరెక్టర్, కెమెరామేన్ సహా యూనిట్ మెంబర్స్ ఎవరూ షూటింగ్ స్పాట్‌లో లేరని- నాలుగు గోడల నడుమ.. నలు వైపులా నాలుగు కెమెరాలు అమర్చి, వాటిని రోల్ చేసి.. అందరూ దూరంగా వెళ్లిపోయిన తర్వాత తేజస్వి తన 'లో-దుస్తులు' సహా అన్నిటినీ విప్పేసి, పూర్తి నగ్నంగా నటించిందని సమాచారం.
మరి ఆ సన్నివేశాన్ని 'ఐస్‌క్రీమ్' సినిమాలో సెన్సార్ కత్తెరకు దొరకకుండా రాంగోపాల్ వర్మ ఎలా ప్రజెంట్ చేసి ఉంటాడనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్. నవదీప్-తేజస్వి జంటగా 'కమింగ్ టు బర్న్ యు' అంటూ రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఐస్‌క్రీమ్' చిత్రాన్ని 'భీమవరం టాకీస్' పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.