"అమ్మా... నాన్న కథ ఇదా..." ఓబుల్ రెడ్డి సంతానం ప్రశ్న?
WD
"అమ్మా.. నాన్న కథ ఇదా.." అంటూ పిల్లలు అడుగుతుంటే తల్లి ఏమని సమాధానం చెప్పుకోవాలో తెలీని స్థితి. అనంతపురం ఫ్యాక్షన్ హత్యల నేపధ్యంగా తీసిన "రక్తచరిత్ర" చిత్రంలో ఓబుల్ రెడ్డి పాత్రను బుక్కారెడ్డిగా వర్మ చిత్రీకరించారు.
ఆ పాత్రను పరమరాక్షసుడిగా తీర్చిదిద్దిన వైనాన్ని ఓబుల్ రెడ్డి పిల్లలు చూసి తమ తల్లిని ప్రశ్నించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని హైదరాబాద్‌లో తెలుగుదేశం కార్యాలయంలో చర్చ జరిగింది.
వాస్తవ విషయానికి వస్తే ఓబుల్ రెడ్డికి 18 ఏళ్లకే పెండ్లి చేశారట. ఊరిలో ఆడవారిని రకరకాలుగా హింసిస్తుంటే అప్పుడు పెండ్లి చేశారని చెపుతారు. అయితే సినిమాలో మాత్రం పెండ్లి ప్రస్తావన లేకుండా కేవలం ఊరిలోని ఆడవారిని అనుభవించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు చూపారు.