"ధనుష్‌" సినిమా నుంచి వాకౌట్ చేసిన త్రిష?

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్, అందాలతార, పొడవుకాళ్ల సుందరి త్రిష జంటగా "ఆడుకలమ్" అనే కోలీవుడ్ చిత్రం రూపొందుతోంది. 

దీన్ని తెలుగులో డబ్బింగ్ చేయనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం చేయనని త్రిష వాకౌట్ చేసిందని సమాచారం.

దీంతో త్రిష స్థానంలో ఢిల్లీకి చెందిన "తపసి" అనే అమ్మాయిని హీరోయిన్‌గా ఎన్నుకున్నారట. పలు వ్యాపార సంస్థలకు మోడల్‌గా వ్యవహరించిన తపసికి ఇదే ప్రథమ చిత్రం. ఇందులో కథానాయిక ఆంగ్లో ఇండియన్‌గా ఉండాలని.. అందుకే తపసిని ఎంపికచేశామని దర్శకుడు వెట్రిమారన్ తెలిపారు.

అయితే త్రిష ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణమేమిటో? తెలియరాలేదు. కానీ.. ఆంగ్లో ఇండియన్‌గా "ఆడుకలమ్" సినిమా పాత్రకు సరిపోనని భావించే త్రిష వాకౌట్ చేసిందని కొందరంటే.., బక్క పలచని హీరో ధనుష్ సరసన నటించేందుకు ఇష్టం లేకనే త్రిష తప్పుకుందని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇంతకీ త్రిష.. ఈ సినిమా నుంచి తప్పుకునేందుకు అసలు కారణమేమిటో..?!.

వెబ్దునియా పై చదవండి