సినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన తాము సెక్స్ వర్కర్లు కాదంటూ సినీ నటి స్నేహ ఘాటుగా సమాధానం ఇచ్చింది. పలు తమిళ పత్రికలు పలువురు హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇష్టానుసారంగా వార్తలను రాస్తున్నాయి. ముఖ్యంగా, అవకాశాల కోసం హీరోయిన్లు దర్శకులకు సెక్స్వర్కర్లుగా మారారంటూ ఈ పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై స్నేహ తీవ్రంగా మండిపడింది. తమది అందాల ప్రపంచమే.