పోలీసులకు రంజిత పూర్తి నగ్న వీడియో..?!!

నిత్యానంద- రంజిత సెక్స్ స్కాండల్ రోజుకో మలుపు తిరుగుతోంది. నిత్యానందతో రాసలీలల్లో పాల్గొన్న నటి రంజితకు సంబంధించి పూర్తి నగ్న వీడియో చెన్నై పోలీసుల వద్ద ఉన్నట్లు భోగట్టా. రంజిత- నిత్యానందల సెక్స్ వీడియోను తీసిన డ్రైవర్ ధర్మానంద ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తమిళ మీడియా గగ్గోలు పెడుతోంది. 

అయితే ఇవన్నీ వట్టి బూటకపు వార్తలనీ, తనపై ఎవరో పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని అటు నిత్యానంద.. ఇటు రంజిత వేర్వేరుగా స్పందించారు. నిత్యానంద అయితే సోమవారం కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ తానిప్పుడూ మౌనవ్రతం చేస్తున్నాననీ, అసత్య ప్రచారం చేస్తున్నవారికి తగిన శిక్ష పడుతుందని వేదాంత వచనాలు వల్లిస్తున్నారు.

కానీ నిత్యానంద డ్రైవర్ ధర్మానంద మాత్రం రంజితకు సంబంధించిన పూర్తి నగ్న వీడియోను తీశాడనీ, వాటిని నేరుగా పోలీసులకు అప్పగించాడని అంటున్నారు. ఇదే గనక నిజమైతే రంజిత- నిత్యానందకు జైలు ఖాయమని చెపుతున్నారు.

కాగా రంజితకు సంబంధించిన నగ్న వీడియోలలో ఉన్నది నిజంగా నటి రంజిత అయి ఉంటుందా.. కాదా అనే విషయంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు భోగట్టా. ఒకవేళ అదే నిజమని తేలితే నిత్యానంద స్వామి ఒప్పుకుంటారో... లేదంటే తనలాంటి మరో మనిషి ఆడిన నాటకమని చెప్పుకుంటారో...? వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి