బూతు కథ చిత్రాలతో అదరగొడుతున్న ఏక్తా కపూర్

'డర్టీ పిక్చర్', 'రాగిణి ఎంఎంఎస్' వంటి బూతు కథ చిత్రాలతో బాలీవుడ్ భామ ఏక్తా కపూర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయనున్నారు. కేవలం ఇలాంటి చిత్రాలు తీయడమే కాకుండా కోట్లాది రూపాయలను ఎలా కూడబెట్టుకోవాలో కూడా పసిగట్టింది. ఇప్పటికే 'లవ్ సెక్స్ ఔర్ ధోఖా' అనే చిత్రంతో కోట్లాది రూపాయలను గడించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా 'రాగిణి ఎంఎంఎస్', 'డర్టీ పిక్చర్స్' వంటి చిత్రాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ రెండు చిత్రాల ద్వారా ఈ భామ కనీసం 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు గడించవచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా 'పెద్దవారికి మాత్రమే' అని చూసించే "ఏ" గుర్తు కనపడితేనే ఆడవాళ్లు ఆమడదూరం పారిపోతారు. కానీ ఈ ఏక్తా కపూర్ శైలి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే ముదురు బ్రహ్మచారిణిగా ముద్రవేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తనకు కథలు వినిపించేందుకు వచ్చే దర్శకుల్లో బూతు కథ ఉన్న వారికే ముందుగా అపాయింట్‌మెంట్ ఇస్తున్నారట.

వెబ్దునియా పై చదవండి