బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి పాలయ్యారు. గురువారం యశోద ఆస్పత్రిలో చేరిన ఆయనను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పరామర్శించారు. జ్వరం, మధుమేహ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని కవిత పరామర్శించారు. తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే సీఎం రేవంత్, కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా యశోద డాక్టర్లను ఫోన్ చేసి కేసీఆర్ హెల్త్ అప్‌డేట్ గురించి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని.. సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన పారామీటర్ల అంతా సాధారణంగా ఉన్నాయని.. ప్రస్తుతం కేసీఆర్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచామని పేర్కొన్నారు.