"బొమ్మాళీ" బాటలో కాజల్, మీరాజాస్మిన్..!

"అరుంధతి" చిత్రం ద్వారా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ, బిల్లా సుందరి అనుష్క.. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు సరసన కొత్త చిత్రంలో నటిస్తోంది.

'అరుంధతి' సినిమాతో హారర్ మూవీల క్రేజ్, లేడి ఓరియెంటెడ్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిన బొమ్మాళీ బాటలోనే మరికొందరు హీరోయిన్లు పయనిస్తున్నట్లు సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజ "మగధీర"లో యువరాణిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.

"ఛాంది" అనే పేరుతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, ఎం.ఎస్. రాజు ర్మాణ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందులోని లేడి ఓరియెంటెడ్ పాత్రలో అందాల బొద్దుగుమ్మ ఛార్మిని ఎంపిక చేయాలని ముందు భావించారు. కానీ "మగధీర" రికార్డుతో ఛార్మి ఛాన్సును కాజల్ అగర్వాల్ కొట్టేసిందని తెలిసింది.

ఇదేవిధంగా 'మోక్ష' పేరుతో రూపుదిద్దుకోనున్న మరో హారర్ చిత్రంలో "మీరా జాస్మిన్" కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి "బ్లాక్ అండ్ వైట్" ఫేమ్ శ్రీకాంత్ వేముల దర్శకత్వం వహిస్తున్నారు. గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజీవ్ మోహన్, నాజర్, రాహుల్ దేవ్‌లు నటించనున్నట్లు సమాచారం.

అమర్‌నాథ్ మూవీస్ పతాకంపై అమర్‌నాథ్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఫిలిమ్ నగర్ వర్గాలు తెలిపాయి. ఇంకేముంది..? అనుష్కకు 'అరుంధతి' లాగానే.. కాజల్‌కు 'ఛాంది', మీరాకు 'మోక్ష' సినిమాలు గుర్తింపు సంపాదించి పెట్టాలని ఆశిద్దామా..?

వెబ్దునియా పై చదవండి