హైదరాబాద్‌లో లవ్ స్టార్ కపుల్ "రానా - శ్రియ.."?

WD
లీడర్‌తో సంచలన విజయాన్ని కైవసం చేసుకున్న యువనటుడు, స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు అయిన జూనియర్ రామానాయుడు (రానా) సెక్సీ నటి శ్రియలిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని టాలీవుడ్ సినీజనం గుసగుసలుపోతున్నారు.

లీడర్ చిత్రం తర్వాత రానా 'దమ్మరే దమ్' హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. అదేవిధంగా తెలుగు - తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న రానాకు ఓ సినీ ఫంక్షన్లో శ్రేయ తారస పడిందట.

తొలుత 'హాయ్' చెప్పుకున్న ఇద్దరూ ఆ తర్వాత 'హలో' అనుకుని అటు పిమ్మట గంటలకొద్దీ మాటలతో గడిపేయడం మొదలుపెట్టారు. ఈ బంధమే ప్రేమబంధంగా మారిపోయిందని టాలీవుడ్ సినీవర్గాల టాక్.

అంతేకాదు ఇటీవల వీళ్లద్దరూ కలిసి హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో కలిసి ఎంజాయ్ చేయడం చాలామంది చూశారట కూడా. మరి ఇది నిజమో.. కాదో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి