ఈటీవీలో అత్యంత ఎక్కువ టిఆర్‌పి పొందుతున్న కార్యక్రమాలలో ఢీ ఒకటి. అందులో ఎన్ని సీజన్లు వచ్చినా ప్రజాదరణ ఏమాత్రం తగ్గట్లేదు. అదేవిధంగానే ఈ డ్యాన్స్ షోలో ఉన్న డ్యాన్సర్లు అంత తక్కువ వారేమీ కాదు. ఆడామగా తేడా లేకుండా అంతర్జాతీయ స్థాయిలో డ్యాన్సులు ఇరగదీస్తున్నారు. అద్భుతమైన డ్యాన్సర్స్ అయిన రాజు, ప్రదీప్ లాంటివారికి ధీటుగా చేయగలవారిలో అక్సా ఖాన్ ఒకరు.
ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలేవీ అవసరం లేదు. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనస్సులను దోచుకోవడంతో పాటుగా సినిమా అవకాశాన్ని కూడా కొట్టేసింది. ఎన్నో రొమాంటిక్ సాంగ్స్‌లో అక్సా ఖాన్ పెర్‌ఫార్మెన్స్‌కు సాధారణ కుర్రాళ్లే కాకుండా యాక్టర్ నాని కూడా ఫిదా అయ్యారట. నాని రానున్న సినిమాలో డ్యాన్సే ప్రాణంగా బ్రతుకుతున్న డ్యాన్స్ మాస్టర్‌గా కనిపించనున్నారు.