హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సెల్వి

గురువారం, 30 జనవరి 2025 (13:34 IST)
Abhinaya
హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేసింది. ఇవన్ని వట్టి రూమర్స్ అని తీసిపారేసింది. తనకు ఇప్పటికే ప్రేమికుడు ఉన్నాడని, తనపై దయచేసి ప్రేమ గాసిప్‌లు ప్రచారం చేయవద్దని అభినయ కోరింది. 
 
గత 15 సంవత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నానని.. అతను తన చిన్ననాటి స్నేహితుడిని చెప్పుకొచ్చింది. తమకు తెలియకుండానే తామిద్దరం ప్రేమించుకోవడం మొదలెట్టామని.. దయచేసి ఏ నటుడితోనూ తనకు ప్రేమ వుందని అంటగట్టొదని చెప్పింది. కానీ తన బాయ్ ఫ్రెండ్ వివరాలను మాత్రం అభినయ వెల్లడించలేదు. 
 
ఇక విశాల్, అభినయ కలిసి పూజ, మార్క్ ఆంటోనీ సినిమాల్లో నటించారు. చిన్నప్పటి నుంచి మూగ, చెవిటి అయిన అభినయ తనపై ఉన్న నమ్మకం వల్లే నేడు నటిగా రాణిస్తోంది. ఆమె విజయానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల మద్దతు అని చెప్పవచ్చు. 2008లో 'నేనింతే' అనే తెలుగు సినిమాతో అభినయ తొలిసారిగా నటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు