మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్‌లో వుండగానే తదుపరి చిత్రం కోసం దర్శకనిర్మాతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంటోంది. తదుపరి చిత్రంగా మురుగదాస్‌తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి, ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో మహేశ్ కథానాయికగా శ్రుతిహాసన్.. కీర్తి సురేష్ .. శ్రద్ధా కపూర్ .. అలియా భట్ తదితరుల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. ఫైనల్‌గా అలియా భట్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఏది ఏమైనా, మహేశ్ బాబు సరసన నటించాలనే ఆసక్తి కారణంగానే ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. ఠాగూర్ మధు .. ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు. మహేష్ కెరియర్లో ఈ స్థాయి బడ్జెట్ ఇదే మొదటసారి అని చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.