ముంబై మహానగరంలో ఓ డెలివరీ బాయ్ గలీజు పని చేశాడు. లిఫ్టులో మూత్ర విసర్జన చేస్తూ నిఘా నేత్రానికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని స్థానిక విరార్ వెస్ట్‌లోని ఒక భవనం లిఫ్టులో మూత్ర విసర్జన చేశాడు. దీంతో సదరు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌పై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత భవనం నివాసితులు ఈ సంఘటనను గుర్తించారు.
భవనంలోని నివాసితులు లిఫ్టులో మూత్రం ఉండటాన్ని గమనించి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్లింకిట్ జాకెట్ ధరించిన వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. దాంతో నివాసితులు బ్లింకిట్ కార్యాలయానికి వెళ్లి నిందితుడిని గుర్తించారు. అక్కడ అతన్ని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాంతో విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషనులో అతనిపై కేసు నమోదైంది.