తెలంగాణలో కరోనావైరస్ కేసులు 200 వచ్చాక చూద్దామన్న బన్నీ, ఎవరితో?

శుక్రవారం, 24 జులై 2020 (22:48 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ భారీ చిత్రంలో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. అయితే... ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన టైమ్‌లో కరోనా రావడంతో కేరళలో ప్లాన్ చేసిన షూటింగ్‌ను రాజమండ్రికి షిప్ట్ చేసారు.
 
అక్కడ మారేడుపల్లి అడవుల్లో షూటింగ్ చేయాలి అనుకున్నారు కానీ... కరోనా రోజుకురోజుకు పెరగడం లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. షూటింగ్స్ చేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చారు. ఇక పుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే... బన్నీ షూటింగ్ చేయడానికి ఓకే చెప్పకపోవడంతో పుష్ప సెట్స్ పైకి వెళ్లలేదు.
 
రామోజీ ఫిలింసిటీలో సెట్ వేసారు. జాగ్రత్తలు తీసుకుని రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటే... బన్నీ కరోనా కేసులు తెలంగాణలో 200 లేదా 300 స్ధాయికి వచ్చే వరకు చేయనని ఖచ్చితంగా చెప్పేశారట. దీంతో షూటింగ్ చేద్దామనుకున్న సుకుమార్.. షాక్ అయినట్టు సమాచారం. మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే... సుకుమార్ ప్రస్తుతానికి పుష్ప ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టేసి వెబ్ సిరీస్ చేసే ప్లాన్లో ఉన్నాడట. అదీ.. సంగతి...!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు