అనిల్ రావిపూడి ప్లాన్ అదిరింది

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (14:18 IST)
పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై, అపజయం అనేది లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 తీయాలనుకున్నాడు. కథ రెడీగా ఉంది. నిర్మాత దిల్ రాజు రెడీగా ఉన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రెడీనే కానీ... నటించేందుకు వెంకటేష్ - వరుణ్ తేజ్ రెడీగా లేరు.
 
అందుచేత ఎఫ్ 3 ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే... లాక్ డౌన్లో అనిల్ రావిపూడి వరుసగా కథలు రెడీ చేసారు. అలా రెడీ చేసిన కథతో దిల్ రాజు సినిమా చేయబోతున్నారు.
 
 ఇక్కడ విషయం ఏంటంటే... అనిల్ రాపూడి రెడీ చేసిన కథను ఆయన డైరెక్ట్ చేయడం లేదు. మరో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే.. ఈ కథకు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ కావాలి.
 
ఆ ఇద్దరు హీరోలు సాయిధరం తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌లను అనుకుంటున్నారని తెలిసింది. వచ్చే సంవత్సరం ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. మరి.. అనిల్ రావిపూడి కథ.. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో ఎలా ఉండబోతుందా..?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు