నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి చిత్రంతోనే కమర్షియల్ సక్సస్ సాధించిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో సుప్రీమ్, రవితేజతో రాజా ది గ్రేట్, వెంకటేష్ - వరుణ్ తేజ్‌లతో ఎఫ్ 2 చిత్రాలు తెరకెక్కించి వరుస విజయాలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
ఎందుకంటే... మహేష్ బాబుకి టైటిల్ సెంటిమెంట్ వుంది. మురారి, అతడు, పోకిరి, ఒక్కడు, దూకుడు .. ఇలా మూడు అక్షరాలతో వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. తాజాగా మూడు అక్షరాలతో వచ్చిన మహర్షి సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుని సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
అందువలన తదుపరి సినిమా టైటిల్ కూడా మూడు అక్షరాలతో ఉండేలా చూడమని మహేష్ బాబు.. అనిల్ రావిపూడితో చెప్పినట్టు తెలిసింది. దీంతో అనిల్ రావిపూడి మూడక్షరాల టైటిల్ కావాలి. ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుందని తెగ ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నాడట. మరి... అనిల్ రావిపూడి ఏ టైటిల్ పెడతాడో..? మహేష్‌ని ఎలా చూపిస్తాడో..?