హీరోయిన్లు పాత్రరీత్యా ఎటువంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమవుతున్నారు. కల్చర్ మారాక పాత్ర రూపురేఖలు మారిపోతున్నాయి. వెబ్‌సిరీస్ వచ్చాక నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో ప్రేమ, హర్రర్‌తోపాటు రొమాన్స్ పేరుతో శ్రుతిమించిన సందర్భాలున్నాయి. నటి అంజలి అటువంటి పాత్ర ఒకటి చేసింది. బాలీవుడ్లో కొందరు లెస్బియన్‌గా నటించిన సందర్భాలున్నాయి. తాజాగా అంజలి కూడా అలా నటించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం పావ కథైగళ్ సినిమా చేసింది.