సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రస్తుతం జర్నీ హీరో జైతో ప్రేమాయణం సాగిస్తోంది. ఎంచక్కా సినిమాలు, పార్కులు, బీచ్‌లంటూ షికార్లే కాకుండా.. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని.. షూటింగ్ స్పాట్‌లకు కూడా ఇద్దరూ జోడీగా వెళ్తున్నారని కోలీవుడ్‌లో ఒకటే టాక్.
కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు పాకిన అంజలి.. జైతో కలిసి.. తమిళ స్టార్ సూర్య పిలుపుతో 'దోశ ఛాలెంజ్'ను స్వీకరించి, దోశ వేసి అంజలితో తినిపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నిజమేనని నిరూపించారు.