దేవసేన వివాహం ఆయనతో జరుగనుందా?

బుధవారం, 17 జూన్ 2020 (18:04 IST)
బాహుబలి హీరోయిన్ దేవసేన, అనుష్క శెట్టి త్వరలో వివాహం చేసుకోనుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. తాజాగా అనుష్క వివాహంపై వదంతులు వస్తున్నాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్‌ని ఆమె పెళ్లి చేసుకోవడం ఖాయమని వారి వివాహం దాదాపుగా ఖరారు అయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
అలాగే అనుష్క చేతిలో ఉన్న సినిమాలను పూర్తి అయిన తర్వాత ఆమె ఈ వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇక త్వరలోనే అనుష్క ఎంగేజ్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో టాక్ వినపడుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా వస్తుందని సమాచారం. అయితే ఈ వార్తలపై అనుష్క ఇంకా స్పందించలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు