ఒకటి రెండు సినిమాలకంటే దాదాపు పది సినిమా చేశాక హిట్ కొట్టిన హీరోలు వున్నారు. అందుకే ఆచితూచి స్టెప్ వేయాలంటారు. కనుక ఇప్పుడు ఆశిష్, వైష్ణవి చైతన్య చిత్రం లవ్ మీ.. చిత్రం పూర్తయింది. విడుదలకు సిద్ధమంటు ప్రకటించారు. కానీ మరలా వాయిదా వేశారు. అందుకు కారణం షూటింగ్ కొంత పార్ట్ కు దిల్ రాజు శాటిస్ ఫై కాలేదని తెలుస్తోంది. అందులో మరలా రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ నేటి ట్రెండ్ కు తగినట్లు కొంత లేదని ఆఘమేఘాలపై రీ షూట్ చేస్తే అనుకున్న టైం కు రిలీజ్ చేస్తారనీ, లేదంటే మరో వారం పొడిగించే వీలుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.