సలార్‌పై జ్యోతిష్యులు వేణు స్వామి ఏం చెప్పారంటే?

బుధవారం, 6 డిశెంబరు 2023 (14:36 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చాలా హైప్డ్ యాక్షన్ డ్రామా. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 22కి వాయిదా పడింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగా రాకపోవడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ రాజీ పడకుండా మరికొన్ని సన్నివేశాలను రీషూట్ చేశాడని వార్తలు వచ్చాయి. 
 
ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. రాజకీయ రంగంలోనూ, సినీ రంగంలోనూ ప్రముఖుల జాతకాలను బయటపెట్టి సెలబ్రిటీగా మారారు జ్యోతిష్యుడు వేణు స్వామి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఏ సినిమా కూడా హిట్ కాదనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
 
తాజాగా సలార్ సినిమాకు సంబంధించి వేణు స్వామి గతంలో ఏం చెప్పారంటూ నెటిజన్లు పాత వీడియోలను సెర్చ్ చేశారు. సాలార్ సినిమాపై అభిమానులు ఆశలు పెట్టుకోవద్దని వేణు స్వామి హెచ్చరించిన వీడియోను నెటిజన్లు గుర్తించారు. 
 
కమర్షియల్‌గా కూడా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొంత కాలం పాటు ప్రభాస్ ఈ ఫ్లాప్‌లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా చెప్పినట్లు ప్రభాస్ మూడు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు డార్లింగ్ అభిమానులు సాలార్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
 గతంలో కొందరు సెలబ్రిటీలపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు