మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఐవీఆర్

మంగళవారం, 19 ఆగస్టు 2025 (18:04 IST)
తమిళనాడు రాష్ట్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. అబ్బాయి మంచివాడు, ఆస్తి, అంతస్తు బాగానే వున్నాయని ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతిశ్వరిని యోతీశ్వరన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కి ఇచ్చి పెళ్లి చేసారు. ఐతే పెళ్లయిన కొద్దిరోజులకే అతడి నిజ స్వరూపాన్ని తెలుసుకున్నది జ్యోతి. పెళ్లైన వారానికే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీనితో యోతీశ్వరన్ తన భార్యను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు.
 
ఐతే ఈమధ్య ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి తిరిగి భర్త యోతీశ్వరన్ వద్దకు వచ్చింది. ఇంటికి వచ్చిన జ్యోతికి మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. భర్త గంజాయికి బానిసనీ, అతడికి 30 మంది అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు వున్నట్లు అతడి ఫోను ద్వారా తెలుసుకున్నది. దీనితో భర్తను ఈ విషయంపై నిలదీసింది. మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. తను ఎంతో ఆశతో పెళ్లి చేసుకుంటే ఇలాంటి చెడు వ్యసనాలతో వున్న భర్త తనకు వచ్చినందుకు ఎంతగానో దుఃఖించింది.
 
ఆ బాధను తన సోదరితో పంచుకునేందుకు పెరుంగళత్తూరుకి వెళ్లింది. సోదరి నివాసం వుండే 12వ అంతస్తుకి లిఫ్టులో వెళ్లింది. ఐతే ఇంట్లోకి వెళ్లకుండా నేరుగా మేడ పైకి వెళ్లి అక్కడి నుంచి దూకేసింది. అంత ఎత్తు నుంచి కిందకు దూకేయడంతో ఆమెకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. జ్యోతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యోతీశ్వరన్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు