తనకోసం గత మూడు సంవత్సరాలుగా ఆ అమ్మాయి వెయిట్ చేస్తోందని చెపుతూ నిశ్చితార్థం అయిన తర్వాతే ఆమె గురించి పూర్తి వివరాలు చెబుతానని ప్రభాస్ తన స్నేహితులతో అన్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఆమె పేరు, ఫోటో బయటపెడితే ఆ అమ్మాయి కుటుంబానికి అసౌకర్యంగా మారుతుందనే ఉద్దేశ్యంతో తాను ఇలా రహస్యం కొనసాగిస్తున్నట్లుగా ప్రభాస్ కామెంట్ చేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మళ్ళీ పెళ్ళి వార్తల సందడి ప్రారంభం అయిందనే అనుకోవాలి.