US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

సెల్వి

సోమవారం, 7 జులై 2025 (23:20 IST)
Accident
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ దంపతులు బలైపోయారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న శ్రీవెంకట్, తేజస్విని దంపతులు. వారి ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్న వారి కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి స్థానికంగా ఉండే బంధువులను కలిసిందుకు కారులో వెళ్లారు. వారిని కలిసి తిరిగి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
మృతులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్‌ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్‌ కుటుంబం సజీవదహనమైంది. 
 
ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గ్రీన్ కౌంటి ఏరియాలో రాంగ్ రూట్‌లో వచ్చి కారును మినీ ట్రక్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్‌ ల్యాబుకు పోలీసులు పంపారు. మృతుల హైదరాబాద్‌కు చెందిన శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు కాగా... వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించడం జరిగింది. 

అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం మొత్తం సజీవ దహనం

వెకేషన్ కోసం డల్లాస్‌కు వెళ్ళిన కుటుంబం

అట్లాంటలోని బంధువుల ఇంటికి కారులో వెళ్ళి.. తిరిగి డల్లాస్‌కు వస్తుండగా ప్రమాదం

గ్రీన్ కౌంటి ఏరియాలో రాంగ్ రూట్‌లో వచ్చి కారును ఢీకొట్టిన మినీ ట్రక్

కారుకు మంటలు… pic.twitter.com/EiveLnaYiM

— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు