బాహుబలి-2 వేడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా రూ.120 కోట్లతో తెరకెక్కి అంచనాలను మించి రూ.600 కోట్లు కొల్లగొట్టడంతో బాహుబలి -2పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి -2 ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యింది.
'బాహుబలి 2'లో ఒక కీలకమైన పాత్రను పోషించవలసిందిగా అమితాబ్‌ను కోరడం కోసమే ఆయనని రాజమౌళి కలిశాడనే వార్తలు వెలువడుతున్నాయి. మరికొందరు ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ కోసం ఇటీవల ముంబై వెళ్లిన రాజమౌళి, మర్యాద పూర్వకంగా అమితాబ్‍ను కలిసి ఉంటారని అంటున్నారు. వీటిలో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.