ఇప్పుడు ఎవరు సినిమా తీయాలన్నా బాహుబలి రికార్డుల వైపే చూస్తున్నారు. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు చేయాలంటే ఖచ్చితంగా బాహుబలి చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని తీయాలనుకుంటున్నారు. తాజాగా చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఇదే తోవలో నడుస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి చిత్రం కావడంతో భారీ తారాగణాన్ని ఇందులో నటింపజేయాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకా మరో పవర్‌ఫుల్ పాత్రలో సల్మాన్ ఖాన్‌ను అడిగినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగూ తెల్లదొరల కాలం నాటి సినిమా కాబట్టి హాలీవుడ్ నటులను కూడా తీసుకుంటే మరికాస్త రేంజ్ పెరుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తమ్మీద బాహుబలి స్థాయిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించాలన్న ప్రయత్నమైతే జరుగుతుందని చెప్పొచ్చు. మంచి పరిణామమే...!!