దీనిపై చాలామంది టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు రాంగోపాల్ వర్మపై అనేక విమర్శలు దాడులు కూడా చేసారు. దీనితో రెచ్చిపోయిన వర్మ ఖచ్చితంగా ఎన్‌టీఆర్ మహానాయకుడు సినిమా విడుదలైన పక్కరోజే తన సినిమాను విడుదల చేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు.
మొదట ఎన్‌టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని జనవరి 25న విడుదల చేస్తామని ప్రకటించగా వర్మ తన సినిమాను జనవరి 26న విడుదల చేస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత బాలయ్య తన సినిమాను ఫిబ్రవరి 7కి వాయిదా వేయగా, వర్మ కూడా తన సినిమాను ఫిబ్రవరి 8కి వాయిదా వేసాడు. తాజాగా ఎన్‌టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం, దీనితో వర్మ కూడా ఆ పక్కరోజే తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడట.