సీనియర్ డైరెక్టరుతో బాలయ్య సినిమా ఫిక్స్...

ఆదివారం, 4 అక్టోబరు 2020 (13:22 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కావడం.. ఈ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌ను యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరడం లేదు. సమ్మర్‌కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. పూరి జగన్నాథ్‌తో బాలయ్య "పైసా వసూల్" అనే సినిమా చేసాడు. ఈ సినిమాతో బాలయ్య - పూరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. బోయపాటి సినిమా తర్వాత పూరితో బాలయ్య సినిమా ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత పూరితో కాదు వినాయక్‌తో బాలయ్య సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... బాలయ్య సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాకి కథ మాటలు బుర్రా సాయిమాధవ్  అందిస్తున్నారని సమాచారం.
 
బాలయ్య - బి.గోపాల్ మూవీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనుకున్నారు కానీ.. ఈ మూవీ ఫిక్స్ అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు