కరాటే కళ్యాణి అంటే ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఈమె రంగస్థల నటి కూడా. బుర్రకథలు చెప్పడంలో విశేష అనుభవం వుంది. మంచి డాన్సర్ కూడా. సినిమాల్లో అవకాశాలు లేనప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్లో పాల్గొంటుంది. ఇటీవలే ఓ య్యూట్యూబ్ ఇంటర్యూలో తన జీవిత సహచరులు గురించి చెప్పింది. ఇప్పటికి తనకు రెండు పెండ్లిళ్లు అయ్యాయి. అయినా అర్థం చేసుకుని విడిపోయాం. ఇప్పుడు మూడో పెల్లికి రెడీ. కానీ నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి. ఇద్దరు నన్ను వాడుకుని వదిలేశారు. అంటూ క్లారిటీగా చెప్పింది. గతంలో సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆమె ఆ కుటుంబానికి అండగా నిలిచింది. అది నెట్టింట్లో పెట్డడంతో వైరల్ అయింది. అప్పుడు ఆమెను తప్పని స్థితిలో అరెస్ట్ చేశారు.