తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నరేశ్, కరాటే కల్యాణిలపై 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నటి హేమ ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తనపై వీరు అసభ్య వ్యాఖ్యలు చేశారని, అసభ్య వ్యాఖ్యలతో కూడిన వీడియోను విడుదల చేశారని లేఖలో తెలిపారు.
తన ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, సోషల్ మీడియా లింక్ ను కూడా ఎన్నికల అధికారికి పంపారు. అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో నరేశ్, కరాటే కల్యాణిలు ఓటు వేయకుండా నిషేధం విధించాలని కోరారు.