సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చిన రేవతి కుటుంబ సభ్యులు, రేవతి చనిపోవడం, ఆమె కొడుకు ఇంకా కోమాలో వున్నాడు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాక రేవతి భర్త మీడియా ముందుకు వచ్చి తాను కేసును వాపసు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగిన పరిణామాలు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.