రాజమౌళి చిత్రంలో.. అలా కోర్కె తీర్చుకోనున్న చిరంజీవి!

శుక్రవారం, 27 నవంబరు 2020 (12:07 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసినటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ప్రొడక్షన్‌పై నటిస్తున్నారు. అయితే, ఇపుడు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కూడా భాగం కానున్నారనేదే ఆ వార్త. 
 
నిజానికి రాజమౌళి దర్శకత్వంలో నటించాలనివుందని చిరంజీవి గతంలో వ్యాఖ్యానించారు. కానీ, ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇపుడు చిరంజీవి దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో మాత్రం తెరపై కనిపించకుండానే ప్రేక్షకులను అలరించబోతున్నారు. 
 
ఈ సినిమాలో తారక్, రాంచరణ్ పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. దీనికి సంబంధించి రాజమౌళి ఫోన్ చేయగానే చిరంజీవి రెండో ఆలోచన చేయకుండానే ఓకే చెప్పేశారట. 
 
మరోవైపు హిందీ వర్షన్‌లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలియా భట్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు