సంక్రాంతికి ఆ సినిమాలు రావడం లేదా..?

సోమవారం, 25 మే 2020 (15:09 IST)
కరోనా కారణంగా టాలీవుడ్‌లో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. సమ్మర్‌కి రావాల్సిన సినిమాలు అన్నీ ఆగిపోయాయి. దీంతో ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. షూటింగ్ చేసుకోవడం కోసం పర్మిషన్ ఇవ్వమని సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌ని కలిసి చెప్పారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
 
జూన్ నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక థియేటర్స్ ఆగష్టు నుంచి ఓపెన్ అవుతాయని టాక్ వినిపిస్తుంది. దీంతో ఆగష్టులో ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయి..? దసరాకి ఏయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి...? సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది హాట్ టాపిక్ అయ్యింది. 
 
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదంటూ వార్తలు వస్తున్నాయి.
 
చిరు సినిమాతో పాటు మరో సినిమా కూడా సంక్రాంతికి రావడం లేదు అని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఏ సినిమా అంటారా..? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... ఈ సినిమా షూటింగ్ చేయాల్సింది చాలా ఉండటంతో సంక్రాంతికి రావడం కష్టం అంటున్నారు. మరి... ఈ రెండు సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో..?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు