బాలీవుడ్ బార్బీ డాల్ కత్రినా కైఫ్‌ను ఉద్దేశించి హీరో రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బిటౌన్‌లో చర్చనీయాంశమైనాయి. సాకు దొరికింది కదా అని కత్రీనాను కించపరిచే కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 5 టాక్‌షో ఇటివలే ప్రారంభమైయింది. ఈ షోకి హీరో రణ్‌వీర్, రణ్‌బీర్‌లు హాజరయ్యారు.
షోలో బాగంగా కత్రినాను ఉద్దేశించి కరణ్ కొన్ని ప్రశ్నలేశాడు. కత్రినా నటనపై నీకామెంట్ అని రణ్‌వీర్ సింగ్‌ని కరణ్ అడిగాడు. దీనికి షాకింగ్ అన్సర్ ఇచ్చాడు రణ్‌వీర్ సింగ్. ''సినిమా మొత్తంలో ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగల హీరోయిన్ కత్రినా'' అంటు హేళన చేశాడు రణ్‌వీర్. పక్కనే వున్న కత్రినా మాజీ ప్రియుడు రణ్‌బీర్ కూడా ఈ సమాధానానికి నవ్వుకున్నాడు.
రణ్‌వీర్ వేసే జోకులకు రణ్‌బీర్ నవ్వుకోవడం చూసి కత్రినాకు బాగానే కోపం వచ్చిందని సన్నిహితులు అంటున్నారు. అంతేగాకుండా ఆరేళ్ల తమ ప్రేమ విఫలమైనందుకు తనకు ఎటువంటి బాధా లేదని రణ్ బీర్ కపూర్ ఓ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కత్రీనా కోపాన్ని మరింత ఎక్కువ చేసింది. త్వరలోనే ఆమె కూడా ‘కాఫీ విత్ కరణ్’ వస్తోందట. మరి, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్‌లకు కత్రీనా ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.
ఇకపోతే.. బాలీవుడ్ చాక్లెట్ బాయి రణ్‌బీర్ కపూర్ అఫీషియల్‌గా ఇద్దరు హీరోయిన్స్‌తో ప్రేమ వ్యవహారం నడిపాడు. వారు దీపిక పడుకొనే, కత్రినా కైఫ్. మొదట దీపికతో పీకల్లోతు ప్రేమలో మునిగిన రణ్‌బీర్ బ్రేకప్ ఇచ్చుకుని కత్రీనా వెంటపడ్డాడు. ఈ జంట పెళ్లి చెసుకుంటుదని కూడా ప్రచారం జరిగింది. అయితే మధ్యలో ఏమైందో మళ్ళీ గుడ్ బై చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు రణ్‌బీర్‌కు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కత్రినాతో మాట్లాడటం మానేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రణ్‌బీర్ సోదరి హీరోయిన్ కరీనా కపూర్ కూడా దీపికా, కత్రీనా ఇద్దరూ రణ్‌బీర్‌కు సెట్ కారని తేల్చేసింది. కత్రినా, దీపికల్లో రణ్‌బీర్‌కు నిజ జీవితంలో జోడీగా ఎవరైతే బాగుంటారు? అనే ప్రశ్నకు షాకింగ్ సమాధనం ఇచ్చింది కరీనా. ''నిజం చెప్పాలంటే.. కత్రినా, దీపిక.. ఇద్దరూ కూడా నాకు వదినలుగా సెట్ కారు..''అని తేల్చి చెప్పేసింది. కరీనా కామెంట్స్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.