దేవర పార్ట్-2 పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను దసరాకు సెట్ పైకి తీసుకువెళ్ళనున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. కాగా, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో చేసే పనిలో వున్నారు. మరి దేవర 2 వెంటనే వుండనున్నట్లు సమాచారం.