కానీ ఇటీవలే ఆమె ఓ చిత్రమైన పోస్ట్ పెట్టింది. ప్రేమకు వయసుతో పని లేదు అంటూ ఆమె వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. పైగా ఈ విషయం గురించి ఉద్దేశిస్తూ తమ కంటే తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటల గురించి ప్రస్తావించింది. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనన్, మరో హాలీవుడ్ జంట కూడా ఉన్నారు. దీనిపై పలు అనుమానాలు నెటిజన్లకు వ్యక్తమవుతున్నాయి. మరి కొద్దిరోజుల్లో ఏదైనా ట్విస్ట్ ఇస్తుందేమో చూడాలి.